Home ప్రత్యేకం బెస్ట్ సీఎంల జాబితాలో టాప్‌లో జగన్.. చివర్లో కేసీఆర్!

బెస్ట్ సీఎంల జాబితాలో టాప్‌లో జగన్.. చివర్లో కేసీఆర్!

దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు.కాగా..ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను దేశం ఎలా ఎదుర్కొంది..ప్రధాని నరేంద్ర మోదీ పాలన తీరు ఎలా ఉంది..ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది..అనే అంశాలపై ఈ సర్వే జరిగింది. ఏబీపీ న్యూస్ – సీ ఓటర్.. 543 లోక్ సభ నియోజకవర్గాల్లో 30 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వేను నిర్వహించారు.


ఇక అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాలుగో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఐదో స్థానంలో,ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘల్  ఆరో స్థానంలో ఉన్నారు. ఏడో స్థానంలో మమతా బెనర్జీ, 8వ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహన్ నిలిచారు. తొమ్మిదో స్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, పదో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.కాగా..ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అట్టడుగున నిలవగా.. హర్యానా సీఎం ఖట్టర్ చివరి నుంచి రెండో స్థానంలో.. పంజాబ్ సీఎం అమరీందర్ కింది నుంచి మూడో స్థానంలో ఉన్నారు….

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు