Home ప్రత్యేకం బెంగాల్‌ ఎన్నికలు.. సీ ఓటర్ సర్వేలో సంచలన ఫలితాలు!

బెంగాల్‌ ఎన్నికలు.. సీ ఓటర్ సర్వేలో సంచలన ఫలితాలు!

పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏప్రిల్‌/మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పదేళ్ల పాలనకు చెక్‌ పెట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. మరో దఫా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) వ్యూహాలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ, బీజేపీ మధ్య కొంత కాలంగా మాటలయుద్ధం నడుస్తోంది. టీఎంసీ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. వీరిలో మంత్రులు, ఎంపీలు ఉన్నారు.

ముఖ్యంగా మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెన‌ర్జీతో స‌హా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణ‌మూల్‌ కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే దీప‌క్ హ‌ల్దార్. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదని చెప్పి తాజాగా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో బెంగాల్‌లో ఈసారి బీజేపీ విజయ ఢంకా మోగించే అవకాశాలు ఉన్నాయని అత్యధికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీ ఓటర్ సర్వే నిర్వహించింది. కాగా..బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 41.6 శాతం దక్కుతాయని సర్వే పేర్కొంది. టీఎంసీకి 36.9% ఓట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 8.4 శాతం, లెఫ్ట్ పార్టీలకు 4.4 శాతం, ఇతరులకు 2.3 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు