Home వార్తలు బెంగళూరులో అలరిస్తున్న వాయుసేన విన్యాసాలు..వీడియోలు వైరల్

బెంగళూరులో అలరిస్తున్న వాయుసేన విన్యాసాలు..వీడియోలు వైరల్

భారత వైమానిక ప్రదర్శన (ఏరో ఇండియా-2021)  కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. ఏరో ఇండియా ప్రదర్శనను కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పాల్గొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. కాగా,కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ సారి హైబ్రిడ్‌ ఎయిర్‌షోగా దీన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు డిజిటల్‌ వేదికల ద్వారానే ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు.

ఈసారి ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 601 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. ఆద్యంతం ఆసక్తి కలిగించే రఫేల్‌ జెట్, అమెరికా అపాచి హెలికాప్టర్లు భారతీయ సైన్యం తరఫున విన్యాసాలు చేయనున్నాయి. అమెరికాకు చెందిన బి-1బి లాన్సర్‌ సూపర్‌సానిక్‌ బాంబర్ ఈ ప్రదర్శనలో కనువిందు చేస్తోంది.కాగా,దేశంలో ప్రతి రెండేండ్ల‌కు ఒక‌సారి నిర్వ‌హించే ఈ ఎయిర్ షోకు ఈ సారి క‌ర్ణాట‌క ఆతిథ్యం ఇస్తోంది. ఉద‌యం మూడు ఎంఐ-17 హెలిక్యాప్ట‌ర్ల ద్వారా ఈ ఎయిర్ షోను ప్రారంభ‌మ‌య్యాయి. భార‌త్‌, ర‌ష్యా, అమెరికా దేశాల‌కు చెందిన జాతీయ జెండాలతో ఈ మూడు హెలిక్యాప్ట‌ర్లు ఆకాశంలో చ‌క్కెర్లు కొట్టాయి.కాగా,వాయుసేన గగన విన్యాసాల‌ను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు.

#WATCH | Aircraft taking part in the flypast in Atmanirbhar formation at Aero India-2021 in Bengaluru. pic.twitter.com/eusLZOnouL
— ANI (@ANI) February 3, 2021#WATCH | Airborne Early Warning and Control (AEW&C) System aircraft flying past in Netra formation at Aero India show in Bengaluru. pic.twitter.com/dc50ze20ML
— ANI (@ANI) February 3, 2021#WATCH | Surya Kiran Aerobatic Team of the Indian Air Force and Sarang helicopter display team conduct aerobatic display at Aero India show in Bengaluru. pic.twitter.com/yRrVLQbtBS
— ANI (@ANI) February 3, 2021Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు