Home క్రీడలు బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా కోనేరు హంపి

బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా కోనేరు హంపి

ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి బీబీసీ స్పోర్ట్స్‌ వుమ‌న్ ఆఫ్ ద ఇయ‌ర్ 2020గా ఎంపికైంది. భారత స్ప్రింట‌ర్ ద్యుతీచంద్‌, షూట‌ర్ మ‌ను భాక‌ర్‌, రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌ల‌ను వెన‌క్కి నెట్టి హంపి ఈ అవార్డు గెలుచుకోవ‌డం విశేషం. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ అవార్డు కోసం పోటీలో ఉన్న ఐదుగురు నామినీల్లో తమకు ఇష్టమైనవారికి ఓటు వేశారు. నామినీల జాబితాను బీబీసీ ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ రచయితలు, జర్నలిస్టులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ వీరిని ఎంపిక చేసింది.

ఇక ఐదుగురు నామినీల్లో ప్రజల ఓట్లు ఎక్కువగా పొందిన హంపి ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం గెలుచుకుంది. కాగా..గతేడాది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గెలుచుకున్నారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష లైఫ్ టైమ్ అచీవ్‌మెంటు అవార్డు అందుకున్నారు.

ఇదిలావుంటే.. భారత్ లో క్రికెట్‌లాంటి ఔట్‌డోర్ ఆటలతో పోలిస్తే చెస్‌లాంటి ఇండోర్ ఆటకు అంత‌గా ఆద‌ర‌ణ ఉండ‌దు. ఈ అవార్డుతో అయినా చెస్ గేమ్ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంద‌ని ఆశిస్తున్నా అని అవార్డు గెలిచిన త‌ర్వాత హంపి పేర్కొంది. ఇక 2019 డిసెంబ‌ర్‌లో హంపి వ‌ర‌ల్డ్ రాపిడ్ చెస్ చాంపియ‌న్‌షిప్ గెల‌వ‌గా.. 2020లో కెయిర్న్స్ క‌ప్ విజేత‌గా నిలిచింది. 2002లో 15 ఏళ్ల వ‌య‌సులో దేశంలో యంగెస్ట్ గ్రాండ్‌మాస్ట‌ర్‌గా హంపి నిలిచిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు