Home ప్రత్యేకం బిగ్ బ్రేకింగ్: ‘ఆర్‌సీ 15’లో సీఎంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్!

బిగ్ బ్రేకింగ్: ‘ఆర్‌సీ 15’లో సీఎంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్!

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఎగ్జయిట్‌మెంట్ పెరిగిపోయింది. దర్శకధీరుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరవాత వెంటనే శంకర్ లాంటి గొప్ప దర్శకుడితో మరో పాన్ ఇండియా మూవీలో చరణ్ నటించనుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఒక తెలుగు హీరోతో శంకర్ పనిచేస్తుండటం ఇదే తొలిసారి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.

ఇదిలాఉంటే.. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ యంగ్ చీఫ్ మినిస్టర్ గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందనుందట. మరి చరణ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, రామ్ చరణ్ 15వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ కీయరా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియరా ఇంతకముందు చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో సందడి చేసింది. అలానే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు