Home ప్రత్యేకం బిగ్ బాస్ సీజన్ 5: తొలి కంటెస్టెంట్ గా షణ్ముఖ్‌ జశ్వంత్‌!

బిగ్ బాస్ సీజన్ 5: తొలి కంటెస్టెంట్ గా షణ్ముఖ్‌ జశ్వంత్‌!

గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందించిన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ గతేడాది డిసెంబర్‌ 20న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో సీజన్‌ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. స్టార్ మా కూడా ఐదో సీజన్‌ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై అభిమానుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం.

కాగా,ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ ఇప్పటికే మొద‌లు పెట్టారు నిర్వాహ‌కులు. తొలి కంటెస్టెంట్ గా  సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో స్టార్ గా మారిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇత‌నికి సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు  యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.కాగా, అత‌డి ఎంపికై  త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. గ‌త సీజ‌న్ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని  సీజ‌న్ 5 కంటెస్టెంట్ విష‌యంలో నిర్వాహకులు చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. కొంచెం పాపుల‌ర్ వ్య‌క్తుల‌నే ఈ సీజ‌న్‌కు తీసుకురావాల‌ని భావిస్తున్నారు.బిగ్ బాస్ సీజ‌న్ 5ని కూడా నాగార్జున‌నే హోస్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు