Home టీవీ బిగ్‌బాస్ 5: షో ప్రారంభం అప్పటి నుంచే.. ఈసారి హోస్ట్ ఎవరంటే..?

బిగ్‌బాస్ 5: షో ప్రారంభం అప్పటి నుంచే.. ఈసారి హోస్ట్ ఎవరంటే..?

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి.  ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గగతేడాది డిసెంబర్‌ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ షోలో చివరి వరకు బరిలో ఉన్న అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే సీజన్-5 ఆలస్యం కాకుండా ఆర్నెళ్లు తిరిగే సరికి మళ్లీ వచ్చేస్తుందని ఆ మధ్య చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే బిగ్ బాస్ షో ఈసారి కూడా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్-5 ను ముందుగా 2021 మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో మొదలు పెట్టాలని అనుకున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కంటెంస్టెంట్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా ఐదో సీజన్ కూడా సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాక గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన ‘కింగ్’ అక్కినేని నాగార్జున సీజన్-5 కి హోస్టుగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్ బాస్ ఈసారి ప్రేక్షకులకు అలరించడానికి ఎలాంటి థీమ్ తో రాబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు