Home సినిమాలు ‘బాహుబలి’, ‘రాధేశ్యామ్‌’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప’ టీజర్‌

‘బాహుబలి’, ‘రాధేశ్యామ్‌’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప’ టీజర్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఊరమాస్‌ గెటప్‌లో దర్శనమివ్వనున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. అయితే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 7న పుష్పరాజ్‌ పాత్రని పరిచయం చేస్తూ మేకర్స్ టీజర్‌ రిలీజ్ చేశారు. విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ఇక ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 32 మిలియన్‌ వ్యూస్‌ని దాటేసింది. అంతేకాదు, మిలియన్‌ లైక్స్‌కు దగ్గర్లోఉంది. ముఖ్యంగా లైక్స్‌ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల రికార్డును ‘పుష్ప’ బ్రేక్ చేసింది.

కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథలో హీరోయిన్‌ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నారు. కాగా, ఈ పాన్‌ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో పుష్పపై భారీ అంచనాలే ఉన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు