Home సినిమాలు బాల‌య్య‌- అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లైన్ ఇదే!

బాల‌య్య‌- అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లైన్ ఇదే!

నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్ రావిపూడి. మహేష్ బాబు కూడా అనిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అంతకన్నా ముందు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్న మహేష్.. .త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
దీంతో అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ ను బాలయ్యతో సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అనిల్ రావిపూడి ఇటీవలే బాలయ్యను కలిసి కథను వినిపించాడట. ఆ కథ  నచ్చడంతో బాలయ్య కూడా అనిల్ రావిపూడికి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అనిల్ రావిపూడి కామెడి ప్ర‌ధానంగా సినిమాలు తెర‌కెక్కించాడు. మ‌రి బాల‌య్యతో ఎలాంటి సినిమా చేస్తాడ‌ని చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఈ చిత్రం కామెడీ యాక్ష‌న్ జాన‌ర్‌లో న‌డుస్తుంద‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు మ‌స్ యాంగిల్‌లో ఉంటుంద‌ని తెలుస్తుంది. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించనుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు