Home సినిమాలు బాలీవుడ్‌ అవార్డ్స్‌లో బన్నీ దూకుడు.. 'అల వైకుంఠపురములో' మూవీకి అవార్డుల పంట

బాలీవుడ్‌ అవార్డ్స్‌లో బన్నీ దూకుడు.. ‘అల వైకుంఠపురములో’ మూవీకి అవార్డుల పంట

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్‌ లుక్‌, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్‌, యాక్టింగ్‌ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు. కాగా బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌, పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ మూవీ ట్రైలర్‌ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించిన ట్రైలర్ ల జాబితాలో నిలిచింది.
తాజాగా ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అవార్డుల పంట పండింది. బాలీవుడ్‌ లైఫ్‌ డాట్ కామ్‌ 2021 అవార్డుల జాబితాలో అన్ని కెటగిరీల్లోనూ అల వైకుంఠపురములో సినిమా రికార్డులు సృష్టించింది. దక్షిణాది చిత్రాల కెటగిరీలో అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌ నిలిచారు. వీటితోపాటు బెస్ట్‌ సాంగ్‌, రాములో రాములో, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌-సుశాంత్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- పీఎస్‌ వినోద్‌, బెస్ట్‌ స్క్రిప్ట్‌ వంటి రంగాల్లో అవార్డులు దక్కాయి. ఒక హీరోయిన్‌ తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అల వైకుంఠపురములో సినిమా అవార్డులను క్లీన్‌ స్వీప్‌ చేసేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు