Home సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న పవన్ సినిమా!

బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న పవన్ సినిమా!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన డిజాస్టర్‌ సినిమా అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా అజ్ఞాతవాసి భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. కాకపోతే అజ్ఞాతవాసి సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నా కూడా మన సినిమా నుంచి కాకుండా ఒరిజినల్ నుంచి కథ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా జరుగుతోంది.

2018లో అజ్ఞాతవాసి సినిమా విడుద‌లైనప్పుడు చాలా వివాదాలు వ‌చ్చాయి. అజ్ఞాతవాసి సినిమాను జెరోమ్‌ తెరకెక్కించిన లార్గో వించ్‌ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపించాయి. కథతో పాటు కథనం కూడా యదాతథంగా ఉండటంతో అప్పట్లో జెరోమ్‌కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. ఇప్పుడు ఇదే సినిమాను అఫిషియ‌ల్‌గా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ హీరోగా రుస్తోమ్ దర్శకుడు టిను సురేష్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి నీరజ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు