Home సినిమాలు బాలయ్య సరికొత్త రికార్డ్.. టాప్ 3లోకి దూసుకెళ్లిన 'అఖండ' టీజర్

బాలయ్య సరికొత్త రికార్డ్.. టాప్ 3లోకి దూసుకెళ్లిన ‘అఖండ’ టీజర్

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ”అఖండ”. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య – బోయపాటిల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’లో ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్‌ రోర్ టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇది రికార్డులని కూడా బద్దలుకొడుతోంది. టీజ‌ర్ విడుద‌లై రెండు వారాలు కూడా కాక‌ముందే 50 మిలియ‌న్స్ వ్యూస్ సాధించి టాప్ 3లో చోటు దక్కించుకుంది

ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’, భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ల రికార్డుల‌ను బద్దలు కొట్టింది అఖండ‌ టీజర్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 54.5 మిలియన్ల వ్యూస్ నమోదుచేసి అల్లు అర్జున్ ‘పుష్ప’ అగ్ర స్థానంలో ఉండగా 50.6 మిలియన్లతో ‘రామరాజు ఫర్ భీమ్’ రెండో స్థానంలో ఉంది. బాల‌య్య జోరు చూస్తుంటే వాటిని కూడా అఖండ బద్దలు కొడుతుందేమోన‌ని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కరోనా నిబంధనల నడుమ వికారాబాద్ అడవుల్లో శరవేగంగా జరుపుకొంటోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు