Home సినిమాలు బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్ ఫిక్స్: 'అఖండ‌’గా నంద‌మూరి నటసింహం.. !

బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్ ఫిక్స్: ‘అఖండ‌’గా నంద‌మూరి నటసింహం.. !

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌తో కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. తాజాగా ఉగాది పండుగ సంద‌ర్భంగా బాల‌కృష్ణ-బోయపాటి సినిమాకు ‘అఖండ‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్రబృందం.

అలానే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌గా, ఇందులో బాల‌కృష్ణ లుక్ దుమ్మురేపేలా ఉంది. ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ ఆయన పోషిస్తున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. విభిన్న గెటప్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్‌, దానితో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌ నిలుస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా బాలయ్య సరికొత్త లుక్‌ను చూడటం కోసం తహతహలాడుతున్నారు అభిమానులు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు