Home సినిమాలు బాలయ్య - బోయపాటి మూవీ క్రేజీ అప్‌డేట్: అతిథి పాత్రలో అలరించనున్న స్టార్ హీరో!

బాలయ్య – బోయపాటి మూవీ క్రేజీ అప్‌డేట్: అతిథి పాత్రలో అలరించనున్న స్టార్ హీరో!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ‘రూలర్’‌తో డిజాస్టర్‌ అందుకున్న బాలకృష్ణ, ‘వినయ విధేయ రామ’తో దారుణ ఫ్లాఫ్‌ను మూటగట్టుకున్న బోయపాటి శ్రీను ఈసారి భారీ హిట్‌ కొట్టాలన్న కసితో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అతిథి పాత్రలో మంచు హీరో మనోజ్ కనిపించబోతున్నట్లుగా సమాచారం. సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో ఆయన కనిపించనున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా లో మంచు మనోజ్ గెస్ట్ అప్పియరెన్స్ తప్పకుండా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తుంది. గతంలో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

కాగా, ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు టైటిల్‌ మాత్రం వెల్లడించలేదు.  ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ ఓ కథానాయికగా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘జయ జానకి నాయక’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు