Home సినిమాలు బాలయ్య డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఫిక్స్!

బాలయ్య డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఫిక్స్!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది.  పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది కానీ.. ఈ సినిమా షూటింగ్ ఆరంభంకు ముందే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో ప్రకటించాడు. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు కనుక బన్నీ తదుపరి సినిమా ఏంటీ అనేది అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.
అయితే బన్నీ పుష్ప సినిమా తర్వాత ఐకాన్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ సినిమా ను తెరకెక్కించేందుకు మూడేళ్ల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది కానీ.. ఐకాన్ కంటే ముందు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను బన్నీ చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో నెట్టింట బన్నీ తదుపరి సినిమాను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే అల్లు అర్జున్ సరైనోడు సినిమా చేయడం.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అందుకే వీరిద్దరి కాంబో మళ్లీ సెట్ అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై బన్నీ సన్నిహితులు అనధికారింగా స్పందిస్తూ.. బోయపాటితో మరో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా  ఉన్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు