Home సినిమాలు బాలయ్య ఎంట్రీ మామూలుగా ఉండదట..!

బాలయ్య ఎంట్రీ మామూలుగా ఉండదట..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత మూడోసారి వీరి కలయికలో వస్తున్న చిత్రం ‘అఖండ’. ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. కాగా, ‘అఖండ’కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదేమిటంటే.. చిత్రబృందం ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీని గ్రాండ్‌ లెవల్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్‌ సీక్వెన్స్‌తో రూపుదిద్దుకోనున్న ఈ ఒక్క సీన్‌ కోసమే భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

ఈ చిత్రంలో బాలయ్య పై ఫైట్స్ కానీ తన ఎంట్రీ కానీ మరో లెవెల్లో ఉంటాయని సమాచారం. కాగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్‌ విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తుండగ.. యూ  సి.రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. స్టంట్‌మాస్టర్లుగా రామ్‌ – లక్ష్మణ్ పనిచేస్తున్నారు. మే 28న సినిమా విడుదల కానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు