Home ప్రత్యేకం బాలయ్య ‘అఖండ’ కూడా వాయిదా పడిందా?

బాలయ్య ‘అఖండ’ కూడా వాయిదా పడిందా?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ముచ్చటగా మూడో చిత్రంగా ‘అఖండ’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఒక్కసారిగా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యాయట. అందుకే ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది.

ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడిగా  సి.రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తుంది. అందులో ఒకటి అఘోర పాత్ర అని మొదటి నుంచి టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు