Home సినిమాలు బాలయ్యా మజాకా.. నందమూరి నటసింహం కోసం వందేళ్లు వెనక్కివెళ్లిన యంగ్ డైరెక్ట‌ర్!

బాలయ్యా మజాకా.. నందమూరి నటసింహం కోసం వందేళ్లు వెనక్కివెళ్లిన యంగ్ డైరెక్ట‌ర్!

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్  కథానాయిక. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘క్రాక్​’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్​ మలినేని బాలయ్యతో సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా  రూపొందించనున్నారు. ఆ చిత్ర కథ కోసం గోపీచంద్​.. వందేళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రంథాలయంలో పరిశోధన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియలో హల్చల్ చేస్తోంది. కాగా, ఈ సినిమాను మైత్రి మూవీస్​ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ పాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు