Home సినిమాలు బాలకృష్ణ-బోయపాటి "BB3" మూవీలో శ్రీకాంత్‌ ఫిక్స్‌

బాలకృష్ణ-బోయపాటి “BB3” మూవీలో శ్రీకాంత్‌ ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం వీరి కాంబినేషన్లలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్‌ ల్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
శ్రీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ పంచుకుంది. వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు