Home సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వైష్ణవ్ తేజ్ ఊచకోత..

బాక్సాఫీస్ దగ్గర వైష్ణవ్ తేజ్ ఊచకోత..

‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్స్..

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు  వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. చిత్ర హీరోయిన్‌ కృతి శెట్టికి కూడా ఇది మొదటి సినిమా. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి సినిమానే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.50 కోట్లకు అమ్ముడవగా.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లు కాగా.. మొత్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడానికి సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.

అయితే ‘ఉప్పెన’ సినిమాకి మంచి హైప్ ఉండటంతో పాటు.. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద  కలెక్షన్ల ప్రభంజనం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు ఉప్పెన చిత్రానికి రూ.7 కోట్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్స్ రావడంతో ప్రేక్షకులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో కలెక్షన్లు జోరందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు