Home సినిమాలు బన్నీ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.. పవర్ ఫుల్ విలన్ పాత్రలో 'మక్కల్ సెల్వి '

బన్నీ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.. పవర్ ఫుల్ విలన్ పాత్రలో ‘మక్కల్ సెల్వి ‘

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అయితే మక్కల్ సెల్వి వరలక్ష్మి శరత్ కుమార్. టాలీవుడ్ ప్రేక్షకులను ఇటీవల కాలంలో బాగా ఆకర్షిస్తున్న తమిళ నటీనటులు వీరిద్దరూ. ‘సైరా’, ‘మాస్టర్’, ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ చిత్రాల విజయంతో విజయ్ సేతుపతి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే మరో రెండు సంవత్సరాల వరకూ విజయ్ సేతుపతి డైరీ ఫుల్ గా ఉంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పరిస్థితి కూడా అదే. ఈ మధ్య వచ్చిన ‘క్రాక్’, ‘నాంది’ సినిమాల తర్వాత అమ్మడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. తెలుగులో వరలక్ష్మిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. 

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ క్రేజీ టాలీవుడ్‌ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొరటాల గత సినిమాల మాదిరే #AA21ను కూడా సామాజిక సందేశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ తొలుత విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత పొలిటికల్‌ లీడర్‌గా కనిపించనున్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారంటూ సోషల్‌ మీడియా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె నటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం కొరటాల శివ .. చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. మే 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత కొరటాల సినిమా బన్నీతో ఉండనుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత కొరటాల – బన్నీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు