Home ప్రత్యేకం బన్నీ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌.. ‘ఐకాన్‌’ మూవీపై క్రేజీ అప్‏డేట్ ఇచ్చిన దిల్ రాజు

బన్నీ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌.. ‘ఐకాన్‌’ మూవీపై క్రేజీ అప్‏డేట్ ఇచ్చిన దిల్ రాజు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే చిత్రాన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు  నిర్మించనున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడంతో వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ మీద దృష్టి సారించారు. ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం పూర్తవడంతో అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమా ఎప్పుడు చేస్తారన్న ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. దీనిపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో మేము నిర్మించనున్న తర్వాతి సినిమా ‘ఐకాన్‌’. ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది. వేణు శ్రీరామ్ ఈ మరోసారి చరిత్ర సృష్టిస్తాడనే నమ్మకం నాకుంది. ప్రస్తుతం ఐకాన్ కథ కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం అని దిల్ రాజు వెల్లడించారు. ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు