Home ప్రత్యేకం బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అనిల్ రావిపూడి, బన్నీ కాంబోలో మూవీ ఫిక్స్!

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అనిల్ రావిపూడి, బన్నీ కాంబోలో మూవీ ఫిక్స్!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత  యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో  నటించనున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇటీవలో బన్నీకి ఓ స్టోరీ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పారని సమాచారం.  ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రానుందనే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ అనంతరం అనిల్‌ రావిపూడితో కలిసి సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో కలిసి ఎఫ్‌ 3 సినిమా రూపొందిస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్‌2కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో వెంకటేశ్‌ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్‌ తేజ్‌ పక్కన మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు