Home ప్రత్యేకం బన్నీ పాత్ర మీ ఊహకు కూడా అందదు.. ‘పుష్ప’ గురించి రష్మిక ఏమందంటే..!

బన్నీ పాత్ర మీ ఊహకు కూడా అందదు.. ‘పుష్ప’ గురించి రష్మిక ఏమందంటే..!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకొంటోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది హీరోయిన్ ర‌ష్మిక‌. ఫ్యాన్స్ తో చేసిన ఇంట‌రాక్ష‌న్ లో పుష్ప చిత్రబృందం ఎలాంటి అంచ‌నాల‌కు చేరుకుంటుందో తెలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానంది.

అంతేకాదు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని రష్మిక చెప్పింది. అలాగే బన్నీ స్టామినా ఏంటో సుకుమార్ టీజ‌ర్ లోనే చూపించాడ‌ని పేర్కొంది. కాగా, బన్నీ-సుకుమార్‌ కలయికలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో బన్ని పుష్పరాజ్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు