Home సినిమాలు 'బంగార్రాజు' మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: నాగార్జునను ఢీకొట్టనున్న స్టార్ విలన్!

‘బంగార్రాజు’ మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: నాగార్జునను ఢీకొట్టనున్న స్టార్ విలన్!

ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని నాగార్జున మరోసారి రొమాంటిక్ పాత్రలో అలరించబోతున్నారు. నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వల్‌గా ‘బంగార్రాజు’ మూవీ రాబోతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకు, ఆ పాత్ర లుక్‌కు భారీ ఆదరణ లభించింది. దాంతో ఆ పాత్ర పేరుతో మరో సినిమా చేయాలని భావించిన నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘బంగార్రాజు’ పేరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్  పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దాంతో మొత్తానికి ఈ పాజెక్టు సెట్ అయిందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక  ఈ సినిమాలో విలన్ గా నాగార్జునను ఢీకొట్టే పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అల వైకుంఠపురములో సినిమాలో అప్పలనాయుడు పాత్రలో సముద్రఖని మెప్పించాడు. క్రాక్ సినిమాలో కటారి కృష్ణ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. బంగార్రాజులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ కావడంతో సముద్రఖనినే తీసుకునే ఆలోచన చేస్తున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు