Home వార్తలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు బయలుదేరిన మరో మూడు రాఫెల్ జెట్స్

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు బయలుదేరిన మరో మూడు రాఫెల్ జెట్స్

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం భారత్‌కు బయలుదేరాయి. యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా గాలిలోనే నింధనం నింపుకున్న ఈ యుద్దవిమానలు ఏకధాటిగా ప్రయాణించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు రాత్రి 11 గంటలకు చేరనున్నాయి.కాగా,అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్‌ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది జూలై 29న తొలుత ఐదు రాఫెల్ జెట్స్ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబర్‌లో మరో మూడు రాఫెల్స్‌ జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు చేరాయి. తాజాగా మరో మూడు రాఫెల్స్‌ బుధవారం రాత్రికి జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుతాయి. దీంతో భారత వైమానిక దళంలో రాఫెల్స్‌ జెట్స్ సంఖ్య 11కు చేరనున్నాయి.మరోవైపు వాయుసేన అమ్ములపొదిలోకి  చేరిన రాఫెల్‌ యుద్ధ విమానాలు ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాఫెల్‌ విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. బ్రహ్మాస్త్రం రూపంలో చేసిన విన్యాసం అబ్బురపరిచింది. గణతంత్ర పరేడ్‌లో రాఫెల్‌ విమానాలు పాల్గొనటం ఇదే తొలిసారి కావడం విశేషం.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు