Home ప్రత్యేకం ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్.. బుల్లితెరపై ప్రభంజనానికి ప్లాన్..

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్.. బుల్లితెరపై ప్రభంజనానికి ప్లాన్..

వెండితెరపై సత్తా చాటుతూ అదే స్థాయిలో బులితెరపై ఆదరణ పొందే హీరోలు కొందరే ఉంటారు. అందులో ఒకరే నందమూరి వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన బిగ్ బాస్ సీజన్- 1తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత నడుస్తున్న బిగ్ బాస్ సీజన్లలో కనిపించని ఎన్టీఆర్.. తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్‌గా చేసేందుకు అంగీకరించారన్న సంగతి తెలిసిందే. 

గతంలో స్టార్ మాలో నాగార్జున చిరంజీవిలు హోస్ట్ లు గా వ్యవహరించిన ఈ షో రేటింగ్ సరిగా లేదనే కారణంగా నిలిపి వేయడం జరిగింది. షో ఫార్మట్ ను కాస్త మార్చి ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ షో అప్ డేట్ కోసం.. ఎప్పుడెప్పుడు ఈ షో ఆరంభం అవుతుందో తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా అధికారికంగా ప్రకటించేందుకు జెమిని టీవీ సిద్దమవుతోంది. ఈనెల 13వ తేదీన ఎన్టీఆర్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి మరీ ఈ షో ను అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. అదే సమయంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రోమోలను కూడా వదలబోతున్నారని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు