Home సినిమాలు ఫిబ్రవరిలో విడుదల కానున్న సినిమాలు ఇవే.!

ఫిబ్రవరిలో విడుదల కానున్న సినిమాలు ఇవే.!

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సీజన్‌తో సినిమాల విడుదల జోరందుకుంది. సంక్రాంతి కానుకగా దాదాపు అరడజన్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో క్రాక్, మాస్టర్, రెడ్ సినిమాలకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హీరోలందరూ తాము చేస్తున్న చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సినీ అభిమానులకు ప్రతి నెలా ఇక పండగే. అయితే, ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. మరి ఏ హీరో ఎప్పుడు? ఏ సినిమాతో వస్తున్నారో ఓ లుక్కేద్దామా!

★ ‘జాంబీ రెడ్డి’ (ఫిబ్రవరి 5న విడుదల)
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు.
★ఉప్పెన (ఫిబ్రవరి 12న విడుదల)
బుచ్చి బాబు దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. గతేడాది విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
★FCUK (ఫిబ్రవరి 12న విడుదల)
రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో బేబీ సహస్రిత మరో పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌.. చిట్టి.. ఉమ.. కార్తీక్‌). విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో శ్రీరంజిత్‌ మూవీస్‌పై దామోదర్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు.
★చెక్ (ఫిబ్రవరి 19న విడుదల)
నితిన్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్‌’ అని టైటిల్‌ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది.కాగా,ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు