Home సినిమాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీపై హ‌రీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీపై హ‌రీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఇది 28 వ చిత్రం కావడం విశేషం.. ఇక ఇప్పటికే పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్ నుంచి ఎనిమిదేళ్ళ తరవాత సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో హ‌రీష్ శంక‌ర్‌ని చాలా మంది ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంద‌ని అడుగుతున్నార‌ట‌. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ..”పవన్ కళ్యాణ్ సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వమ‌ని చాలా మంది అడుగుతున్నారు. అప్‌డేట్ కాదు అప్ టూ డేట్ అన్ని స‌క్రమంగా జ‌రుగుతున్నాయి. సమయం వ‌చ్చిన‌ప్పుడు ఆ సినిమా గురించి త‌ప్ప‌క చెబుతాను” అని హ‌రీష్ శంక‌ర్ ఉప్పెన వేదిక‌గా మాట్లాడాడు. కాగా..వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వన్ క‌ళ్యాణ్ .. క్రిష్ సినిమాతో పాటు అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్త‌య్యాక హ‌రీష్ శంక‌ర్ మూవీ మొద‌లు పెట్ట‌నున్నాడు.

కాగా..అంతకుముందు ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. హరీష్ శంకర్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. మెగాస్టార్ ముందే మెగా పంచ్‌లు పేల్చారు.హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నప్పుడు బయట చిరంజీవి గారి కటౌట్ కనిపించింది. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ మొగల్తూరు.. ఎక్కడ చెన్నై.. ఎక్కడ ప్రయాణం.. ఎంతటి ప్రస్థానం.. వైష్ణవ్ తేజ్ వరకూ వచ్చింది.. ఇంకెంత దూరం వెళ్తుందో.నిజంగా భారతదేశంలో రాజ్ కపూర్ గారి తరువాత అంతటి అదృష్టం మళ్లీ మీకే (చిరంజీవి) దక్కింది సార్. ఈ అదృష్టం రాసిపెట్టి ఉండాలంతే. ఒక ఫ్యామిలీని ఇంతలా ఆదరించడం అంటే అది పూర్వజన్మ సుకృతం అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు