Home సినిమాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌గా 'ఫిదా బ్యూటీ'

ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌గా ‘ఫిదా బ్యూటీ’

దక్షిణాది తారల్లో సాయిపల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన డ్యాన్స్‌ స్టెప్పులతో యూత్‌ను ఫిదా చేసిన ఈ రౌడీబేబీ, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఎంతో దగ్గరైంది. కమర్షియల్‌ యాడ్స్‌లో నటించి లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా, వాటికి నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది.కాగా, సాయి పల్లవి కెరీర్ మంచి పీక్స్‌లో ఉంది. వరుస అవకాశాలతో భారీ ప్రాజెక్ట్స్ ఆమె ముంగిట నిలుస్తున్నాయి.

అయితే,ఇప్పుడు సాయి పల్లవి టాలీవుడ్‌లో అగ్ర హీరో సరసన న‌టించే ఛాన్స్ కొట్టేసిన‌ట్టు సమాచారం. అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌లో సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.కాగా,తాజా సమాచారం ప్ర‌కారం సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కొన‌సాగుతుంది. మ‌రికొన్ని రోజుల్లో సాయిప‌ల్ల‌వి షూటింగ్ లో పాల్గొనున్న‌ట్టు తెలుస్తోంది.కాగా,ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్‌ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తోండగా.. కొషీ పాత్రను రానా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ ఫిక్స్ అవ్వగా.. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు