Home సినిమాలు ప‌వ‌న్ కళ్యాణ్-హ‌రీష్ శంక‌ర్ మూవీ క్రేజీ అప్‌డేట్‌

ప‌వ‌న్ కళ్యాణ్-హ‌రీష్ శంక‌ర్ మూవీ క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్- టాలెంటెడ్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ గురించి సినీ ల‌వ‌ర్స్ కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. గ‌‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో బాక్సాపీస్ వ‌ద్ద రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్. ఇపుడు ఈ క్రేజీ కాంబో మ‌రోసారి తెర‌పై సంద‌డి చేసేందుకు ముస్తాబు కూడా అవుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్క‌బోతున్న ప‌వ‌న్‌-హ‌రీష్ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి..ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడ‌ట‌. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాను త్వరలోనే పవన్ సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

గబ్బర్ సింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ అంతకు ముందు నటించిన పలు సినిమాల్లో స్టార్ కమెడియన్ అలీ ముఖ్య పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ మద్య కాలంలో పవన్ సినిమాల్లో ఆయన కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా లో కూడా అలీ నటించలేదు. అలాగే అయ్యప్పనుమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాల్లో  కూడా అలీ పాత్రకు తగినంత ప్రాధాన్యం లేకపోవడంతో పవన్.. అలీ ల కాంబోను చూసే అవకాశం లేదు. కాని హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో మాత్రం అలీ కి ఫుల్ లెంగ్త్ పాత్రను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా అయితే పవన్ తో సినిమా మొత్తం ఉంటే పాత్ర చేశాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రను హరీష్ శంకర్ రాసినట్లుగా సమాచారం

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు