Home ప్రత్యేకం ప‌వ‌న్ అభిమానులకు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన అన‌సూయ‌.. ఇక రచ్చ రంబోలా

ప‌వ‌న్ అభిమానులకు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన అన‌సూయ‌.. ఇక రచ్చ రంబోలా

ప్రముఖ టాలీవుడ్ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ బుల్లితెరపై రాణిస్తునే ఇటూ వెండితెరపై కూడా సందడి చేస్తోంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ వరుసగా సినిమా అవకాశాలను ఒడిసిపట్టుకుంటోంది. ఇక అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా ఈ  హాట్ యాంకర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

ప్ర‌స్తుతం రవితేజ ఖిలాడి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అన‌సూయ‌.. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నేను క‌లిసి చేసే సందడి చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సంద‌డి మీకు చూపించాల‌ని చాలా ఆతృత‌గా ఉంది అని పేర్కొంది. అయితే అన‌సూయ చేసిన వ్యాఖ్యలతో పవర్ స్టార్ ఫ్యాన్స్  అంద‌రు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- క్రిష్ మూవీలో ఈ యాంకరమ్మ ముఖ్య పాత్ర చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు