Home సినిమాలు ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం బందిపోటు, హ‌ర‌హ‌ర మ‌హాదేవ్‌, వీర‌మ‌ల్లు టైటిల్స్ ను ప‌రిశీలించిన క్రిష్‌..ఫిలిం చాంబ‌ర్‌లో టైటిల్స్ రిజిస్ట‌ర్ కూడా చేశాడు. అయితే హ‌ర హ‌ర మ‌హాదేవ్‌, వీర‌మ‌ల్లు టైటిల్స్ ను క‌లిపి హ‌ర హ‌ర వీర‌మ‌ల్లు టైటిల్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇండస్ట్రీ వర్గాల స‌మాచారం. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా టైటిల్‌ను ప్ర‌క‌టించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

కాగా, ప‌వ‌న్ కళ్యాణ్ కెరీర్ లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో క‌థానాయిక‌లుగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ఆ లోపే లీక్ వీరులు ప‌వ‌న్ కళ్యాణ్ ఫొటోని  లీక్ చేశారు.  ఇందులో ప‌వ‌న్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు