Home సినిమాలు ప్ర‌భాస్ 'ఆదిపురుష్': రాముడికి లక్ష్మణుడు దొరికాడోచ్‌..!

ప్ర‌భాస్ ‘ఆదిపురుష్’: రాముడికి లక్ష్మణుడు దొరికాడోచ్‌..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచారు. 2021 ఆరంభం నుంచే తన దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే కమిటైన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ప్రభాస్. ఇప్పటికే ‘సలార్’ సెట్స్ మీదకొచ్చేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇటీవల ఆయన నటించబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ ప్రారంభించేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనుంది ‘ఆదిపురుష్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ ‘ఆదిపురుష్’ రూపంలో చూపించనున్నారట. 

ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటం ఆయన అభిమానుల్లో సరికొత్త ఆతృతను నింపేసింది. ఇదిలా వుంటే తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్‌ యంగ్‌ హీరోను ఎంపిక చేసినట్లు సమాచారం. విక్కీ కౌశల్‌ ప్రభాస్‌ పాత్రకు తమ్ముడిగా నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు అతడి పేరునే ఖాయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి హేమ మాలిని నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా సిద్ధమవుతున్నాడు. ఇక సీత ఎవరన్నదానిపై పలువురి పేర్లు వినిపించగా చివరికి కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు