Home సినిమాలు ప్రొడ్యూసర్ పై ఫిర్యాదు చేసిన ‘క్రాక్’ డైరెక్టర్.. కారణం ఏంటంటే..?

ప్రొడ్యూసర్ పై ఫిర్యాదు చేసిన ‘క్రాక్’ డైరెక్టర్.. కారణం ఏంటంటే..?

డాన్‌ శీను, బలుపు చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిశారు గోపీచచంద్‌ మలినేని, రవితేజ. వీరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘క్రాక్’ బాక్సాఫీస్‌ దగ్గర భారీ హిట్‌ అందుకుంది. సినిమా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, దర్శకులు త్రివిక్రమ్‌, సురేందర్‌ రెడ్డి, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. కాగా ఈ మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, సముద్రఖని, మౌర్యానీ కీలక పాత్రలు పోషించారు. ఇక సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న రిలీజైంది.ఈ చిత్రం ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది.

కాగా..క్రాక్ సినిమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులను చిత్ర నిర్మాత ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించేలా చేయాలని కోరాడు. కాగా..గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలకు ఉపక్రమించింది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అన్నది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు