Home సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపిన 'చావు కబురు చల్లగా'

ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపిన ‘చావు కబురు చల్లగా’

టాలీవుడ్‌ కుర్ర హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’ .కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు ఈ  సినిమాపై భారీ హైప్‌నే క్రియేట్‌ చేశాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

కాగా.. ‘చావు కబురు..’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్ని కలుపుకొని ఇప్పటికే దాదాపుగా 13.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి పోగా సుమారు 4.5 కోట్ల లాభాలతోనే విడుదల అవుతుందని సమాచారం. ఇది కార్తికేయ కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ తో వస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఇక ‘చావు కబురు..’ స్టోరీ విషయానికొస్తే భర్త చనిపోయిన మల్లికని ప్రేమలో పడేయడానికి ట్రై చేసే బస్తీ బాలరాజ్ కథే ఇది. వినూత్నమైన ఈ కథని హాస్యపూరితమైన కథనంతో దర్శకుడు కౌశిక పేగళ్లపాటి ఈ సినిమాని సిద్ధం చేశాడని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు