Home ప్రత్యేకం ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపనున్న ‘వకీల్‌సాబ్’‌.. ఎప్పుడంటే?

ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపనున్న ‘వకీల్‌సాబ్’‌.. ఎప్పుడంటే?

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’‌. బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ‘వకీల్ సాబ్’లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది.

ఇదిలావుంటే..ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. హైదరాబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3న గ్రాండ్ గా ఈ ఈవెంట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మాములుగా పవన్ సినిమాల ఫంక్షన్స్ కి వేరే గెస్టులు కూడా అవసరం ఉండదు. మరి ఈ ఫంక్షన్ ని చిత్ర యూనిట్, అభిమానుల మధ్యలో నిర్వహిస్తారా లేదా ఎవరైనా స్పెషల్ గెస్ట్ ని పిలుస్తారా అనేది చూడాలి. కాగా.. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.  శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు