Home సినిమాలు ప్రభాస్ 'సలార్‌' మూవీ నుండి క్రేజీ అప్‌ డేట్‌

ప్రభాస్ ‘సలార్‌’ మూవీ నుండి క్రేజీ అప్‌ డేట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్ లను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే  సలార్‌ సినిమా గురించి ఇంట్రస్టింగ్‌ విషయాన్ని చెప్పాడు.  ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సలార్ సినిమా మ్యూజిక్‌ పనులు ప్రారంభమయ్యాయని తెలిపాడు.
అలాగే కెజిఎఫ్‌ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల గురించి కూడా ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ బాసూర్‌ రవి అటు సలార్ మ్యూజిక్‌ పనులను ఇటు కెజిఎఫ్‌ 2 రీ రికార్డింగ్‌ పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తున్నాడని తెలిపాడు. అంతేకాదు రవితో పాటు స్టూడియో దగ్గర దిగిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కాగా, ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు