Home సినిమాలు ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. అయితే విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని సమాచారం. డైరెక్షన్ టీంతో వచ్చిన కొన్ని అభిప్రాయభేదాల కారణంగానే ఆయన తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.

కాగా, లెజెండరీ డైరెక్టర్‌గా ప్రఖ్యాతి చెందిన సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో హస్యభరిత, సందేశాత్మక సినిమాలు రూపొందించారు. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఆయన చివరిగా 2013లో ‘వెల్‌కమ్‌ ఒబామా’ సినిమాకు దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్‌, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ (2015)లో అతిథి పాత్రలో అలరించారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు