Home సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్: ‘ఆది పురుష్’ నుండి రానున్న పట్టాభిషేకం స్టిల్!

ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్: ‘ఆది పురుష్’ నుండి రానున్న పట్టాభిషేకం స్టిల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ నటిస్తోంది. రావణాసురుడుగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్  నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.   శ్రీరామనవమి కానుకగా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీరాముడి పట్టాభిషేకం జరిగే సందర్భంలో స్టిల్ ను విడుదల చేయబోతున్నారట చిత్రబృందం.
ఇదిలాఉంటే.. ఇప్పటికే ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా ఉంటుంది అని డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించారు. ఇక ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు సినిమాలోని పాత్రలతో షూటింగ్ చేస్తున్నారు. కాగా, దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు