Home సినిమాలు ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ రూపొందిస్తోంది. గతేడాదే ఈ చిత్రాన్ని ప్రకటించి, నాయికగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణె, ముఖ్యపాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ని ఎంపిక చేసినట్టు తెలియజేసింది చిత్రబృందం.  అయితే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ఆరంభం అవుతుందా అని ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్ జూలైలో ప్రారంభించాలని అనుకున్నారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న  కారణంగా సినిమా చిత్రీకరణను అక్టోబర్‌కు వాయిదా వేశారట. ఈలోపు ప్రీ ప్రొడక్షన్‌ పనులు, యాక్షన్‌ సీక్వెన్స్ పనులపై నాగ్‌ అశ్విన్‌ మరింత దృష్టి సారించాలనుకుంటున్నారని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు