Home సినిమాలు ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రపై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రపై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ కృతి సనన్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆదిపురుష్’ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఆమెకు స్వాగతం పలికారు ప్రభాస్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అవకాశం దక్కడంపై కృతి సనన్ స్పందించారు. ‘కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా. ‘ఆదిపురుష్‌’ లాంటి భారీ సినిమాలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. సీతగా నటించడం పెద్ద బాధ్యత. అయితే, ప్రతిభావంతులైన వ్యక్తులతో పని చేస్తున్నాను కాబట్టి నా వరకు నేను చాలా కష్టపడాలి. మిగతాది దర్శకుడు ఓం రౌత్‌కి, అతని అద్భుత సృష్టికి వదిలేస్తా” అని కృతి సనన్ పేర్కొంది.

ఇక బీటౌన్‌కు చెందిన ఓంరౌత్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా లంకేష్‌ పాత్రలో నటుడు సైఫ్‌‌ అలీఖాన్‌ నటించనున్నాడు. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను 2022 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు