Home సినిమాలు ప్రభాస్ 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్ నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే, ప్రభాస్ పాన్ నేషనల్ స్టార్ గా వెలుగుతున్న ఈ సమయంలో రాముడి పాత్ర పోషిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు సిద్దమవుతోందట చిత్రబృందం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు