Home సినిమాలు ప్రభాస్ 'ఆదిపురుష్‌' నుండి క్రేజీ అప్ డేట్..ముహూర్తం ఫిక్స్‌..

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ నుండి క్రేజీ అప్ డేట్..ముహూర్తం ఫిక్స్‌..

బాహుబలితో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ కు సంబంధించిన ఏ విషయమైన తెగ ట్రెండ్‌ అవుతుంది. అలాంటిది ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ వస్తే.. ఇక చెప్పేది ఏం ఉంది. అభిమానులకు పండగే. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరు ‘రాధే శ్యామ్‌’, ‘సలార్’, ‘ఆది పురుష్’‌ సినిమాలు ఎప్పుడు విడుదల‌ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆది పురుష్‌’కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్‌ని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. 
భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ‘ఆది పురుష్‌’ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జనవరి 19న ఉదయం వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ టీమ్‌తో కలిసి దర్శకుడు ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు. ‘‘మోషన్ క్యాప్చర్ మొదలైంది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’’ అని ప్రభాస్ పేర్కొన్నారు.సాధారణంగా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని ఇంటర్నేషనల్‌ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అత్యున్నత టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీని ఫిబ్రవరి 2న సినిమా లాంఛనంగా ప్రారంభిస్తారు. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమార్‌లతో పాటు ఓంరావుత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆది పురుష్‌’ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు.  బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు…

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు