Home సినిమాలు ప్రభాస్ అరుదైన రికార్డు.. ఇది యంగ్ రెబల్ స్టార్ కు మాత్రమే సాధ్యం!

ప్రభాస్ అరుదైన రికార్డు.. ఇది యంగ్ రెబల్ స్టార్ కు మాత్రమే సాధ్యం!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాహుబాలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇప్పుడీ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు యావత్‌ భారతీయ సినిమా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి తగ్గట్లుగానే ప్రభాస్‌ తన తర్వాతి చిత్రాలను ఓ రేంజ్‌లో  ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక స్టార్‌డమ్‌ విషయంలో ఎంత ఎదిగినా.. అంతే ఒదిగి ఉంటాడు ప్రభాస్‌.

ఇదిలావుంటే.. బాలీవుడ్ స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ప్రస్తుతం ప్రభాస్ కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ ను చూస్తే అర్థం అవుతుంది. ఏ స్టార్ హీరోకు లేనంత ఫాలోయింగ్ ను ఫేస్ బుక్ లో ప్రభాస్ దక్కించుకున్నాడు. ఇతర తెలుగు హీరోలకు అందనంత దూరంలో ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య ఉంది. ఇటీవలే 20 మిలియన్ ల మార్క్ ను క్రాస్ చేసిన ప్రభాస్ తాజాగా మరో రికార్డ్ ను సాధించాడు. ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య చాలా తక్కువ సమయంలో 22 మిలియన్ ల మార్క్ ను దాటేసింది. ఇన్ స్టా గ్రామ్ లో కూడా ఖాతాను కలిగి ఉన్న ప్రభాస్ కు అక్కడ 6.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికి ప్రభాస్ సోషల్ మీడియాలో దూకుడు కనబర్చుతున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు