Home ప్రత్యేకం ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందా...! ఆ గోల్డెన్‌ ఛాన్స్ మీదే కావచ్చు!

ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందా…! ఆ గోల్డెన్‌ ఛాన్స్ మీదే కావచ్చు!

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌. ఆయనకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ స్టార్‌తో నటించాలని చాలా మందికి మనసులో కోరిక ఉంటుంది. కానీ కుదరదు. కానీ ఆ అవకాశాన్ని కల్పిస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. అసలు విషయమేమంటే.. రీసెంట్‌గా ప్రభాస్‌ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పక్కన నటించే అవకాశాన్ని ఇప్పుడు మేకర్స్‌ కల్పించారు. ఆడిషన్‌ను ఏర్పాటు చేశారు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. కాగా, వైజయంతిలో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దీపిక పదుకొనే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో నటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ విడుదలైంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో న‌టించాల‌ని ఆస‌క్తి ఉన్న వారు VYMTALENT@GMAIL.COM మెయిల్ ఐడీకు ప్రొఫైల్స్‌, ఆడిష‌న్ టేప్స్‌ను పంపిచాల‌ని దర్శక నిర్మాతలు కోరారు. ఆసక్తి ఉన్న వాళ్లు వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. 9 నుంచి 14 సంవ‌త్స‌రాల అమ్మాయిల‌‌కు డ్యాన్స్‌ల‌తో పాటు జిమ్మాస్టిక్స్ కూడా తెలిసి ఉండాల‌ని చెప్పారు. అలాగే 20-35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పురుషుల‌కు డ్యాన్సింగ్‌, మార్ష‌ల్స్ ఆర్ట్స్‌పై అవగాహన ఉండాల‌ని తెలిపారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు