Home సినిమాలు ప్రభాస్‌కు జోడీగా స్టార్ హీరోయిన్.. వైరల్‌ అవుతున్న 'ఆదిపురుష్‌' ఫొటోలు

ప్రభాస్‌కు జోడీగా స్టార్ హీరోయిన్.. వైరల్‌ అవుతున్న ‘ఆదిపురుష్‌’ ఫొటోలు

బాలీవుడ్‌ స్టార్ దర్శకుడు ఓంరౌత్‌ నేతృత్వంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ‘ఆది పురుష్‌’. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజుల నుంచి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. కాగా, ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు జోడిగా సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నారని చిత్రయూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలీవుడ్‌ యువ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నాడని చిత్రబృందం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ టీమ్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. 

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమాను పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు