Home సినిమాలు ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా ఎదిగాడు. దీంతో ఆయన్ని అభిమానులు ముద్దుగా యంగ్ రెబల్ స్టార్‌ అని పిలిచేవారు. అయితే బాహుబలి సినిమా ఆయన బిరుదును మార్చేయడమే కాకుండా… తెలుగులో ఏ హీరోకి లేనంతగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాకు అన్ని హద్దులు చెరిపేసి ఆలిండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. దక్షిణాదిని మించి బాలీవుడ్‌లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు.

అయితే, బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో పెద్దగా ఆడకపోయినా బాలీవుడ్‌ని మెప్పించింది. అక్కడ ఏకంగా రూ.100కోట్లకు మించి కలెక్షన్లు సాధించి ప్రభాస్ సత్తా మరోసారి చాటింది. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎప్పుడొస్తుందోనని బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈయన ఒక్కో సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అయితే భారతదేశం లో ఇప్పటి వరకు సినిమాకు 100 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ వంద కోట్ల పారితోషికం ఎవరూ అనుకోలేదు.

ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’, నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’‌లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు దేశవ్యాప్తంగా విజయవంతమైతే ప్రభాస్ పారితోషికం మరింత పెరగవచ్చనే సినీ విశ్లేషణలు అభిప్రాయపడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు