Home ప్రత్యేకం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్న భారతీయులు..ఉన్నత పదవుల్లో 200 మంది!

ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్న భారతీయులు..ఉన్నత పదవుల్లో 200 మంది!

ప్రపంచంవ్యాప్తంగా ఉన్న 15 దేశాల్లో 200 మంది భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు. వీరిలో 60 మంది వరకు క్యాబినెట్ హోదాలో ఉన్నట్టు అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం పనిచేసే ‘ఇండియాస్‌పోరా గవర్నమెంట్ లీడర్స్ 2021’ జాబితాను తాజాగా విడుదల చేసింది. వివిధ దేశాల ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, అందుబాటులో ఉన్న ఇతర వనరుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి, నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 200 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నారని, వీరిలో 60 మంది క్యాబినెట్ ర్యాంక్‌లో ఉన్నట్టు పేర్కొంది. అలాగే, ఈ జాబితాలో ఆస్ట్రేలియా, కెనడా, సింగ్‌పూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, యునైటెడ్ కింగ్‌‌డమ్, అమెరికా దేశాల్లోని భారతీయ సంతతి దౌత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, కేంద్ర బ్యాంకుల చీఫ్‌లు, సీనియర్ అధికారులు ఉన్నారు.

కాగా, విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 32 మిలియన్ల మంది భారతీయ సంతితి వ్యక్తులు ఉన్నారు. మరే దేశ పౌరులు ఇంత పెద్ద సంఖ్యలో లేకపోవడం విశేషం. ‘2021 ఇండియాస్పోరా ప్రభుత్వ నాయకుల జాబితాలోని అధికారులు అందరూ కలిసి 587 మిలియన్ల మంది జనాభాకుపైగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఆ దేశాలు జీడీపీ 28 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.. ఈ నాయకులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతున్నారు అని ఇండియాస్పోరా ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు రంగస్వామి మాట్లాడుతూ..‘అగ్రరాజ్యం అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికవడం గర్వించదగ్గ విషయం.. ప్రజా సేవలో ఉన్న భారతీయుల గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని రంగస్వామి అన్నారు..అలాగే ఈ లీడర్స్ రాబోయే తరాల కోసం వారసత్వాన్ని నిర్మిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు