Home ప్రత్యేకం 'పోకిరి'@15: పూరీ తొలుత అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

‘పోకిరి’@15: పూరీ తొలుత అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.10 కోట్ల‌తో నిర్మించ‌బ‌డ్డ పోకిరి రూ.70 కోట్ల గ్రాస్ తో రూ.40 కోట్ల షేర్ సాధించి ఇండ‌స్ట్రీ ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. బాక్సఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘పోకిరి’గురించి ఓ ఆసక్తికరమైన విషయం మీకోసం..

తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని హీరోగా అనుకోలేదట పూరి జగన్నాథ్. మాస్‌ మహారాజ రవితేజని హీరోగా పెడదమని ఈ కథను సిద్దం చేసుకున్నాడట. కానీ ప‌లు కార‌ణాల‌తో సినిమా కార్యరూపం దాల్చ‌లేదు. కొంత‌కాలం త‌ర్వాత ఇదే స్టోరీ మ‌హేశ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్‌ కూడా ఆకార్లో పెట్టారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య’అని టైటిల్‌ ఫిక్స్‌ చేసుకున్నాడట పూరి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు